(Local) Sat, 24 Jul, 2021

ఓఎన్జీసీలో భారీ అగ్నిప్రమాదం

September 03, 2019,   12:43 PM IST
Share on:
ఓఎన్జీసీలో భారీ అగ్నిప్రమాదం

ముంబైలోని ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ONGC గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఉదయం ఉరాన్ సమీపంలోని గోడౌన్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో శీతల గిడ్డంగిలోని కోట్లాది రూపాయల విలువైన యంత్ర సామగ్రి, ఇతర ఉపకరణాలు, ముడి చమురు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు, ఆ ప్రాంతం చమురు శుద్ధి కర్మాగారం పరిధిలో ఉండటంతో, తగు జాగ్రత్తలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా, ఇప్పటివరకూ మంటలు అదుపులోకి రాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించివుండవచ్చని, ఘటనపై విచారణను జరుపుతామని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వర్గం
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.