(Local) Fri, 22 Oct, 2021

మధ్య ప్రదేశ్ లో పొంగిపొర్లుతున్న ప్రధాన నదులు

August 12, 2019,   12:26 PM IST
Share on:
మధ్య ప్రదేశ్ లో పొంగిపొర్లుతున్న  ప్రధాన నదులు

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నదులన్నీ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగిపొర్లుతుండటంతో ఇప్పటివరకు 32 మంది మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మెరుగుపడినప్పటికీ భారీ వర్షాలకు చాలా నదుల్లో నీటిమట్టాలు పెరిగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నర్మద, చంబల్‌, తపతి, పార్వతి, క్షిప్ర, బల్వంతి, అనాస్‌, రూపరేల్‌, సుక్కడ్‌ నదులన్నీ  ప్రమాదకర స్థాయికి సమీపంలో ప్రవహిస్తున్నాయి.

భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లు తున్నాయి, దీంతో అధికారవర్గాలు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని 28 డ్యామ్‌లకు చెందిన ఏడు స్లూయీస్‌ గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులు తున్నారు. ఈ డ్యామ్‌లలో ఖాడ్వాలోని ఓంకార్వేర్‌ డ్యామ్‌, గునాలోని కృష్ణసాగర్‌ డ్యామ్‌, జబల్‌పూర్‌లోని బర్గీడ్యామ్‌, ధార్‌లోని మహిడ్యామ్‌, భోపాల్‌లోని భడ్‌ భడా డ్యామ్‌లు ఉన్నాయి.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని డ్యామ్‌ల నుంచి నీటి విడుదల చేస్తున్న దృష్ట్యా నర్మద నదీతీరం కొట్టుకుపోయే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో అనేది అధికార యంత్రాంగం పరిశీలిస్తునున్నదని  బర్వానీ జిల్లా కలెక్టర్‌ అమిత్‌ తోమర్‌ అన్నారు. కాగా, చంబల్‌ నదికి వచ్చిన వరదల కారణంగా అందులో భాగంగా మందసౌర్‌ జిల్లాలో వరద పరిస్థితి తెలుసుకునేందుకు రాష్ట్ర  రెవెన్యూ మంత్రి గోవింద్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఏరియల్‌ సర్వే చేశారు.

సంబంధిత వర్గం
మోదీ డబ్బులు వేస్తున్నారని అనుకున్నా!
మోదీ డబ్బులు వేస్తున్నారని అనుకున్నా!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.