(Local) Fri, 22 Oct, 2021

మధ్యప్రదేశ్ సీఎం మేనల్లుడి అరెస్ట్

August 20, 2019,   3:30 PM IST
Share on:
మధ్యప్రదేశ్ సీఎం మేనల్లుడి అరెస్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పూరీని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. రతుల్ పూరీ, మరో నలుగురు కలిసి మోసెర్ బేర్ అనే సంస్థ పేరిట సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.354 కోట్లు రుణం తీసుకొని దుర్వినియోగం చేశారని.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు రతుల్ పూరీ, సహా మరో నలుగురు డైరెక్టర్లపై అభియోగాలు మోపడంతో అరెస్ట్ చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో లంచాలు తీసుకున్నట్లు రతుల్ పై అభియోగాలు ఉన్నాయి. ఆగస్టా కుంభకోణానికి సంబంధించి సోమవారం సమన్లు జారీ చేసిన సీబీఐ… గంటల వ్యవధిలోనే బ్యాంకులను మోసం చేసిన కేసులో రతుల్ ను అరెస్ట్ చేసింది.

సంబంధిత వర్గం
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.