(Local) Mon, 12 Apr, 2021

లింగమనేని పిటిషన్‌పై విచారణ వాయిదా

September 26, 2019,   2:06 PM IST
Share on:
లింగమనేని పిటిషన్‌పై విచారణ  వాయిదా

లింగమనేని రమేశ్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి నదీ తీరానికి వంద మీటర్లలోపు నిర్మాణాలు చేపట్టకూడదని ఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయో తెలియజేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 30వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు.ఉండవల్లి గ్రామ పరిధిలో ఉన్న తమ భూమిలో నిర్మాణాలకు గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిందని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి తన వాదనలో తెలిపారు.

అధికారుల ముందు వాదనలు వినిపించేందుకు తమకు అవకాశం కల్పించాలని అభ్యర్ధించారు. భవనం కూల్చివేత కోసం సీఆర్‌డీఏ ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కోరారు.సీఆర్‌డీఏ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు. కృష్ణానది నుంచి వంద మీటర్లలోపు పిటిషనర్‌ భవనం నిర్మితమై ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందునే అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడుతున్నామని వివరించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.