(Local) Fri, 29 May, 2020

తెలంగాణలో రైతుబంధుకు పరిమితి

November 22, 2019,   11:55 AM IST
Share on:
తెలంగాణలో రైతుబంధుకు పరిమితి

తెలంగాణలో రైతుబంధు పథకానికి ప్రభుత్వం పరిమితి విధించనుంది. 10 ఎకరాలలోపు రైతులకు మాత్రమే రైతుబంధు పథకం అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి సీఎంవో కార్యాలయానికి ఫైల్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక సీఎం కేసీఆర్ నిర్ణయమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ పాత బకాయి, రబీ సీజన్ కు సంబంధించి చెల్లించాల్సిన డబ్బులు సర్దుబాటు  కానీ నేపథ్యంలో పథకం పై సమీక్ష నిర్వహించారు. దీనికి అర్హతను తగ్గించడమే ఉత్తమమనే భావనకు అధికారులు వచ్చారు. దీని పట్ల సీఎం కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే 10 ఎకరాలకు పైగా ఉన్న రైతులందరికి రైతుబంధును నిలిపేయనున్నారు. 

తెలంగాణలో ప్రస్తుతం ఎన్ని ఎకరాలున్నా ఎకరానికి రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రెండు సార్లు ఎకరానికి రూ.10వేలు రైతుబంధు ద్వారా పంటసాయాన్ని సర్కార్ చెల్లిస్తుంది. దీని ద్వారా ఎక్కువ ఎకరాలు ఉన్న భూస్వాములు అధిక లాభం పొందుతున్నారని చిన్న రైతులు ఆరోపిస్తున్నారు. ఉదాహారణకు 20 ఎకరాలు ఉన్న రైతుకు సంవత్సరానికి ఎకరానికి 10 వేలు చెల్లిస్తే రూ.2 లక్షలు రైతుబంధు అందుతుంది. ఒక ఎకరం ఉన్న రైతుకు రూ. 10 వేలు మాత్రమే వస్తున్నాయి. ఇలా రైతుబంధు ద్వారా భూస్వాములే బడాబాబులు అవుతున్నారని చిన్నరైతులు గతంలోనే ఆరోపించారు. ఇప్పుడు రైతుబంధును అర్హులైన పేదరైతులకు మాత్రమే అమలు చేయాలని సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా దీని పై ప్రకటన చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానా పై కూడా భారం తగ్గనుంది. దీని పై చిన్న,సన్నకారు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.