(Local) Wed, 28 Jul, 2021

అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా అచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మి ప్ర‌సాద్‌

August 14, 2019,   11:37 AM IST
Share on:
అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా అచార్య యార్ల‌గ‌డ్డ  ...

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా అచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మి ప్ర‌సాద్‌ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సంవ‌త్స‌రాల పాటు యార్లగడ్డ ల‌క్ష్మి ప్ర‌సాద్ ఈ పదవిలో కొన‌సాగనున్నారు. ఈమేరకు మంగళవారం జివో ఎంఎస్ నెంబర్ 10ను విడుదల చేశారు పర్యాటక శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్. మరోవైపు అధికార భాషా సంఘంలో నలుగురు సభ్యులను కూడా నియమించే వెసులుబాటును సైతం జీవోలో కల్పించారు. 

తెలుగు సాహిత్యం ఉత్త‌రాది వారికి అవ‌గ‌తం కావాలంటే మ‌న సాహిత్య ప్ర‌క్రియ‌ల‌ను హిందీలోకి అనువదింప‌చేయాల‌న్న ఆలోచ‌న‌ల‌కు ఆద్యునిగా ఉంటూ అష్టావ‌ధానం, శ‌తావ‌ధానం వంటి ప్ర‌క్రియ‌లను అనువ‌దించి హిందీలో ప్ర‌చురింప‌చేయ‌టం ద్వారా మ‌న తెలుగు గొప్ప‌ద‌నాన్ని ఉత్త‌రాదికి ప‌రిచ‌యం చేయడంలో విపరీతమైన కృషి చేశారు యార్లగడ్డ. హిందీలో మాత్ర‌మే అందుబాటులో ఉన్న ప‌లు పుస్త‌కాల‌ను తెలుగులోకి కూడా అనువ‌దించి దేశంలోని ఇరు ప్రాంతాల న‌డుమ సాహిత్య వార‌ధిగా వ్య‌వ‌హ‌రించారు. దివంగ‌త సీఎం  వైయస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గ‌తంలో యార్ల‌గ‌డ్డను ఆంధ్ర‌ప్ర‌దేశ్ హిందీ అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. అనంతరం త‌ర్వాత వచ్చిన ప్ర‌భుత్వాలు హిందీ అకాడ‌మీని నిర్వ‌హ‌ణ‌ను ప‌ట్టించుకోలేదు. ఇకపోతే ప్ర‌స్తుతం యార్ల‌గ‌డ్డ లక్ష్మీప్రసాద్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఛైర్మ‌న్‌గా ఉన్న కేంద్రీయ హిందీ సంస్ధ‌లో స‌భ్యులుగా కొనసాగుతున్నారు. 

సంబంధిత వర్గం
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.