(Local) Wed, 21 Aug, 2019

ఆ మానవ మృగానికి ఉరి సరైనదే -కేటీఆర్....

August 09, 2019,   1:59 PM IST
Share on:

వరంగల్ లో అభంశుభం ఎరుగని తొమ్మిది నెలల చిన్నారిపై  అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా న్యాయస్థానం వెలువరించిన తీర్పును టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్వాగతించారు. నేరానికి పాల్పడిన కామోన్మాది ప్రవీణ్‌ను మానవ మృగంగా కేటీఆర్ అభివర్ణించారు. ఇలాంటి భయంకరమైన నేరస్థులను వీధుల్లోంచి తరిమికొట్టాలంటే మరింత కఠినమైన చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దోషికి శిక్ష పడేలా చేసిన పోలీసులు, న్యాయవాదులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

దోషి ప్రవీణ్‌ను మానవమృగంగా కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ప్రమోద్ కుమార్ అనే నెటిజన్‌ ట్విటర్‌లో స్పందించారు. కేటీఆర్‌ నుంచి ఇలాంటి స్పందన ఊహించలేదన్నారు. ‘‘దోషి ప్రవీణ్‌ పుట్టుకతోనే మృగమా.. అతన్ని మృగంలా మార్చడంలో సమాజం పాత్ర ఏమిటి? ప్రవీణ్‌కు మరణశిక్ష విధిస్తే అలాంటి నేరాలు తగ్గుతాయనేందుకు ఆధారాలున్నాయా? భావోద్వేగాలతో సమాజాన్ని నడిపిస్తున్నామా?’’ అని ప్రమోద్ కుమార్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దానిపై స్పందించిన కేటీఆర్.. కొన్ని విషయాలను పౌర సమాజం క్షమించకూడదన్నారు. ఆ మృగం తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడని, అంతకన్నా హీనం ఉంటుందా? అని ప్రశ్నించారు. దోషి కచ్చితంగా మరణశిక్షకు అర్హుడేనని, అలాంటి సైకోలకు అత్యాచారం చేయాలనే ఆలోచన రాగానే వెన్నులో వణుకు పుట్టాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

సంబంధిత వర్గం

చిన్నారిని ఢీ కొన్న తెలంగాణ మంత్రి కాన్వాయ్
చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.