(Local) Tue, 10 Dec, 2019

24 గంటల విద్యుత్‌ ఇచ్చిన ఘనత సిఎం కేసీఆర్ దే

August 28, 2019,   11:45 AM IST
Share on:
24 గంటల విద్యుత్‌ ఇచ్చిన ఘనత సిఎం కేసీఆర్ దే

నిన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన టిఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో  కెటిఆర్‌ మాట్లాడుతూ... అందరికీ 24 గంటల విద్యుత్‌ ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌ దక్కిందని కొనియాడారు. నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత కెసిఆర్‌ ర్‌కే దక్కిందని చెప్పారు. గతంలో నిజాంపేట, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో 14 రోజులకు ఓసారి నీళ్లు వచ్చేవని, ఇప్పుడు రెండ్రోజులకోసారి నీళ్లిస్తున్నామని గుర్తు చేశారు.

గతంలో ఎండాకాలం వస్తే జలమండలి కార్యాలయం ముందు ప్రదర్శనలు జరిగేవని, కానీ ఇప్పుడు ఆపరిస్థితి లేదని ఆయన అన్నారు. రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే కాంగ్రెస్‌ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయని, ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారికి బుద్ధి రాలేదని విమర్శించారు. 50 లక్షల మందికి పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెటిఆర్‌ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పింఛన్లకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తోందని, కానీ, ఏటా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు వెచ్చిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై విశ్వాసం లేక ఎక్కడికక్కడ ఇతర పార్టీల్లో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.