(Local) Wed, 21 Oct, 2020

బయో డైవర్సిటీ వద్ద ప్రమాదంపై కమిటీ ఏర్పాటు

November 25, 2019,   11:51 PM IST
Share on:
బయో డైవర్సిటీ వద్ద ప్రమాదంపై కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ గచ్చిబౌలి బయో డైవర్సిటీ వద్ద ఫ్లైఓవర్ ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఘటనపై నివేదిక సమర్పించాలంటూ ముగ్గురు సభ్యులతో మంత్రి కేటీఆర్ కమిటీ ఏర్పాటు చేశారు. చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ తో పాటు లీ అసోసియేట్ ప్రైవేట్ సంస్థతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఫ్లై ఓవర్ డిజైన్, ప్రమాద నివారణ చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.  శనివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఫ్లై ఓవరపై అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి కిందపడటంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. పలువురికి తీవ్రగాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ చెట్టు విరగడంతో పాటు పలు కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాద తీవ్రత పెద్దగా ఉండటంతో ఫ్లై ఓవర్ పై ఐదురోజుల పాటు రాకపోకలను నిలిపి వేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.