(Local) Sun, 05 Jul, 2020

మానవత్వం చూపిన మంత్రి కేటీఆర్

November 16, 2019,   10:58 AM IST
Share on:
మానవత్వం చూపిన మంత్రి కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చూపి ఓ బాలికను ఆదుకున్నారు. కర్ణాటకకు చెందిన శిల్పారెడ్డి అనే బాలిక బెంగుళూరులోని కొనప్పన అగ్రహారంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. బాలిక వెన్నెముక సమస్యతో బాధపడుతుంది. బాలిక చికిత్స కోసం హీరో మహేష్ బాబు సాయం చేశారు. అయితే శిల్ప నడవడానికి ఓ బెల్ట్ అమరిస్తే ఆమె ఎవరి సాయం లేకుండా నడుస్తుంది. ఆ బెల్టుకు రూ.1.10వేలు ఖర్చుఅవుతుంది . బాలికకు అంత స్థోమత లేదు. బెల్టుకోసం బాలిక 20 వేలు చెల్లించింది. మిగిలిన 90 వేల కసం కర్ణాటక సీఎంని సాయం కోరింది. కర్ణాటక సీఎం నుంచి ఎలాంటి స్పందన లేదు. 

దీంతో ట్విట్టర్ ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను సాయమడిగింది. దీనిని చూసిన కేటీఆర్ ఆమె కర్ణాటక వాసి కావడంతో ప్రభుత్వం తరపున సాయమందించడానికి వీలుపడదని తన స్నేహితుడికి విషయం చెప్పాడు. తన స్నేహితుడి ద్వారా బాలిక తండ్రి నందీష్ రెడ్డికి శుక్రవారం ప్రగతి భవన్ లో కేటీఆర్ చెక్కు అందజేశారు. సాయం చేసినందుకు బాలిక తండ్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.