(Local) Mon, 12 Apr, 2021

బీమా చెక్కులు అందజేసిన కేటీఆర్

November 07, 2019,   11:53 AM IST
Share on:
బీమా చెక్కులు అందజేసిన కేటీఆర్

వివిధ కారణాలతో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ బీమా చెక్కులను అందజేశారు. బుధవారం ఉదయం ఆయన  టీఆర్ఎస్ భవన్ లో  చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ … “టీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది సభ్యత్వం ఉండటం గర్వకారణం. ఈ 60 లక్షల మందిని సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. ఈ రోజు టీఆర్ఎస్ అధికారంలో ఉందంటే దాని వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉంది. ఈ రోజు ఈ విధంగా మిమ్ముల కలుసుకోవడం బాధగా ఉంది. కానీ మిమ్ముల ఆపద సమయంలో ఆదుకుంటున్నందుకు సంతృప్తిగా ఉంది. దేశంలోనే రెండు మూడు పార్టీలే బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ సారి బీమా కింద 1581 మందికి రూ.31 కోట్ల 62 లక్షల రూపాయలకు చెక్కులు అందజేశాం. త్వరలోనే ఇక్కడికి రాలేకపోయిన మిగతా వారికి స్థానిక ఎమ్మెల్యేలు చెక్కులు అందజేస్తారు.” అని కేటీఆర్ అన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.