(Local) Fri, 15 Nov, 2019

మిషన్ కాకతీయకు నీతి ఆయోగ్ మద్దతు -కేటిఆర్

August 24, 2019,   11:35 AM IST
Share on:
మిషన్ కాకతీయకు నీతి ఆయోగ్ మద్దతు -కేటిఆర్

తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడానికి కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే మిషన్ కాకతీయ పథకం కమీషన్ కాకతీయగా మారిందని ప్రతిపక్షాలు అప్పట్లో విమర్శించాయి. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్‌ స్పందించారు. కొందరు వ్యక్తులు మిషన్ కాకతీయ పథకంపై తప్పుడు ప్రచారం చేసినప్పటికీ నీతి ఆయోగ్ ఈ పథకానికి మద్దతు తెలిపిందని కేటిఆర్‌ చెప్పారు.నీతిఆయోగ్ నివేదికను ఇటీవల విడుదల చేసిన కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మిషన్ కాకతీయ సాగుతున్న తీరుపై ప్రశంసలు కురిపించిందని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణలో 22,500 చెరువులు పునరుద్ధరించామనీ, రాష్ట్రంలో చెరువులపై ఆధారపడి జరిగే సాగు 51.5 శాతం పెరిగిందని పేర్కాన్నారు. ఈ మేరకు ట్విట్టర్ కెటిఆర్‌ స్పందించారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.