(Local) Wed, 20 Oct, 2021

అసెంబ్లీ లాబీలో హరీశ్ రావుతో కోమటిరెడ్డి రాజగోపాల్ భేటీ..

September 18, 2019,   2:44 PM IST
Share on:
అసెంబ్లీ లాబీలో హరీశ్ రావుతో కోమటిరెడ్డి రాజగోపాల్ ...

తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీలో ఈ రోజు మధ్యాహ్నం హరీశ్ తో సమావేశమయ్యారు . దాదాపు 30 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పులపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.  గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కమలదళంలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ తాము కాంగ్రెస్ లోనే కొనసాగుతామని కోమటిరెడ్డి సోదరులు స్పష్టం చేశారు. తాజాగా హరీశ్ రావుతో రాజగోపాల్ రెడ్డి భేటీ నేపథ్యంలో ఇరువురు సోదరులు టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.