(Local) Tue, 22 Sep, 2020

కాంగ్రెస్ ఎంపికి ఆరెస్టు వారెంట్ జారీ

August 14, 2019,   10:54 AM IST
Share on:
కాంగ్రెస్ ఎంపికి   ఆరెస్టు వారెంట్ జారీ

కాంగ్రెస్ ఎంపి శశిథరూర్‌కు కోల్‌కతాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఆరెస్టు వారెంట్ జారీ చేసింది. గతేడాది జులైలో కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఒక రాజకీయ సభలో శశిథరూర్‌ మాట్లాడుతూ... 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బిజెపి తిరిగి అధికారం చేపడితే భారత్‌ను ‘హిందూ పాకిస్థాన్’గా మారుస్తుందంటూ తీవ్రవాఖ్యలు చేశారు. బిజెపి ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చి తమకు అనుకూలంగా సవరణలు కూడా చేస్తుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో మాదిరిగా మైనార్టీ వర్గాలకు ఏ మాత్రం విలువనివ్వరని, పూర్తిగా అణిచివేస్తారంటూ విమర్శలు చేశారు. దీనిపై ఓ బిజెపి కార్యకర్త కోర్టుకెక్కారు. దింతో  కోల్‌కతాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

సంబంధిత వర్గం
క్రికెటర్ షమీకి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీచేసిన క ...
క్రికెటర్ షమీకి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీచేసిన క ...
కశ్మీర్‌లో ఏం జరుగుతోంది?..మీకు మా మద్దతు  ఉంటుంది ...
కశ్మీర్‌లో ఏం జరుగుతోంది?..మీకు మా మద్దతు ఉంటుంది ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.