(Local) Mon, 27 Sep, 2021

‘పోలీసుల నోటీసులకు స్పందించని కోడెల కుటుంబం’

October 11, 2019,   10:22 AM IST
Share on:
‘పోలీసుల నోటీసులకు స్పందించని కోడెల కుటుంబం’

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య కేసు విచారణను బంజారహిల్స్ పోలీసులు స్పీడప్ చేశారు. కోడెల కుటుంబ సభ్యులను బంజారహిల్స్ పోలీసులు విచారణ నిమిత్తం పిలిచారు. అయితే కోడెల కుమార్తె, కుమారుడు విచారణకు హాజరు కాలేదు. కేసు విచారణ నిమిత్తం పోలీసులు కోడెల కుటుంబ సభ్యులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై కోడెల కుటుంబసభ్యులు స్పందించలేదని పోలీసులు పేర్కొన్నారు. దీంతో గుంటూర్ వెళ్లి కేసు విచారిస్తామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. కాగా మరో కేసు విషయంలో కోడెల కుమారుడు శివప్రసాదరావు మంగళగిరి కోర్టుకు బుధవారం హాజరయ్యారు. శాసనసభ ఫర్నీచర్ వ్యవహారంలో పూచీకత్తు సమర్పించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన శివప్రసాదరావుకు ఇద్దరు వ్యక్తులు, రూ.25 వేల చొప్పున పూచీకత్తుపై బెయిల్ లభించింది. ప్రతి శుక్రవారం తూళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.