(Local) Mon, 30 Nov, 2020

మద్యం మత్తులో ఐఏఎస్‌ అధికారి - ఒకరు మృతి

August 03, 2019,   1:12 PM IST
Share on:
మద్యం మత్తులో ఐఏఎస్‌ అధికారి - ఒకరు మృతి

మద్యం మత్తులో కారు నడిపి ఓ ఐఏఎస్‌ అధికారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు.కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో బైక్‌పై వెళ్తున్న జ‌ర్న‌లిస్టు మృతిచెందాడు. స్థానిక మ‌ల‌యాళ దిన‌ప‌త్రిక సిరాజ్ లో అత‌ను ప‌నిచేస్తున్నాడు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వేగంగా వ‌స్తున్న కారు జ‌ర్న‌లిస్టు బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న బ‌షీర్ అక్క‌డిక్క‌డే మృతిచెందాడు. అయితే సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా కారు న‌డిపింది ఎవ‌ర‌న్న దానిని పోలీసులు నిర్ధారించారు. 

ప్రమాదం జరిగిన సమయంలో కారును వెంట్రామన్ డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ ప్రమాదంలో ఆయనకు కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రమాద సమయంలో కారులో ఓ మహిళ కూడా ఉన్నారు. కానీ, తాను కారు నడపలేదని, తన స్నేహితుడు నడిపాడని పోలీసులకు ఐఏఎస్‌ అధికారి వాంగ్మూలమిచ్చారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. మృతిచెందిన జర్నలిస్టుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మల్లాపురంలో ఆయన కుటుంబతో నివసిస్తున్నారు.

సంబంధిత వర్గం
బయో డైవర్సిటీ వద్ద ప్రమాదంపై కమిటీ ఏర్పాటు
బయో డైవర్సిటీ వద్ద ప్రమాదంపై కమిటీ ఏర్పాటు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.