(Local) Sun, 07 Jun, 2020

అనూహ్యంగా వ్యూహం మార్చిన కేజ్రీవాల్

August 20, 2019,   11:20 AM IST
Share on:
అనూహ్యంగా వ్యూహం మార్చిన కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనూహ్యంగా వ్యూహాన్ని మార్చారు. ఎన్నికలు సమీపిస్తు వేళ ఢిల్లీ 
ప్రజలకు వరాలు కురిపిస్తున్న కేజ్రీవాల్ ఇప్పుడు తనలోని కొత్త కోణాన్ని బయటకు తీస్తూ ఎన్నికల స్కెచ్ గీశారు. ప్రధాని మోడీ ప్రభంజనాన్ని తట్టుకునేందుకు జాతీయవాదం నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రధాని మోడీపై ఎవరూ విమర్శలు చేయొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఢిల్లీలోని లోక్ సభ స్థానాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించి ఊపుమీదుంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో మోడీ ఇమేజ్ మరింత పెరగడంతో సీఎం కేజ్రీవాల్ వ్యూహాన్ని మార్చారు. దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న బీజేపీ.. ఇఫ్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసింది. ఎవరికి వారు వ్యూహాలు మార్చి రాజకీయాలు నడిపిస్తున్న తరుణంలో ఢిల్లీ ఎన్నికలు ఇప్పటి నుంచే హీట్ పుట్టిస్తున్నాయి

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.