(Local) Fri, 22 Nov, 2019

సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్

August 22, 2019,   11:16 AM IST
Share on:
సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్

రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న సంకల్పంతో ఉన్న సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టంలో కీలక మార్పులు చేసి, సంస్కరణలకు శ్రీకారం చుట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రజలకు వేగంగా సేవలు అందించడం, రెవిన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతి నియంత్రణే లక్ష్యంగా రెవిన్యూ వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది, దీనిలో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) వ్యవస్థను రద్దు చేసి వారిలో ఉన్న క్వాలిఫైడ్‌ వీఆర్‌వోలను జూనియర్‌ అసిస్టెంట్లుగా హోదా మార్చి రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ లేదా వ్యవసాయ శాఖలో కొనసాగించే సంకేతాలు కనబడుతున్నాయి, రెవిన్యూ శాఖలో ఉన్న అవినీతి గురుంచి కేసీఆర్ బహిరంగంగానే తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే అంశాన్ని కేసీఆర్‌ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తలు రెవెన్యూ ఉద్యోగులకు షాక్ అనే చెప్పాలి.

నూతన రెవిన్యూ చట్టం రూపకల్పనపై ప్రగతి భవన్ లో మంగళ, బుధవారాల్లో కలెక్టర్లతో సమావేశం అయిన కేసీఆర్ చట్టంలో పొందుపరిచే అంశాలపై తీవ్రంగా చర్చించారు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో వీఆర్వో ల వల్ల ఇంకా ఎక్కువ అవినీతి జరిగిందని, వీఆర్‌వోల వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనే అభిప్రాయంతో ఉన్న సీఎం, ఈ వ్యవస్థను రద్దు చేసి వీరి సేవలను వేరే విధంగా వాడుకోవాలనే విషయాలపై కలెక్టర్ లతో చర్చించారు, వీఆర్‌వోల తో పాటు సర్వేయర్ల వ్యవస్థ కూడా రద్దు చేయాలనే నిర్ణయానికి కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తుంది.

సంబంధిత వర్గం
ఆర్టీసీపై సాయంత్రం సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
ఆర్టీసీపై సాయంత్రం సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.