(Local) Wed, 24 Jul, 2019

కెసిఆర్‌ దళిత వ్యతిరేకి -కె. లక్ష్మణ్‌

July 05, 2019,   12:08 PM IST
Share on:

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ భవన్‌ వద్ద బిజెపి ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ భవన్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అంబేద్కర్ భవనాన్ని అద్భుతంగా నిర్మిస్తామని చెప్పి మూడున్నరేళ్లయినా ఎందుకు నిర్మించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. సిఎం కెసిఆర్‌ దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కెసిఆర్‌ మోసం చేశారని ఆయన అన్నారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తానని.. పనికి రాని భూముల్ని అంటగట్టి వారిని అవమానపర్చారని విమర్శించారు. సబ్‌ప్లాన్‌ నిధులన్నీ దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కోసం శంకుస్థాపన చేసి అటకెక్కించారని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.