(Local) Sat, 24 Jul, 2021

చంద్రబాబు బాటలో సీఎం కేసీఆర్?

November 15, 2019,   5:34 PM IST
Share on:
చంద్రబాబు బాటలో సీఎం కేసీఆర్?

తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టే విధంగా ముందుకు పోతున్నారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1999 తర్వాత వాటిని అమలు చేశారు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగి 2004 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కేసీఆర్ కూడా నూతన సంస్కరణలు అమలు పెట్టే విధంగా ముందుకు వెళుతుండడంతో టీఆర్ఎస్ నేతలు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

1999 తర్వాత చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచారు. సబ్సిడి బియ్యం ధరను పెంచారు. హస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలలో యూజర్ ఛార్జీలు వసూలు చేశారు. వీటి వల్ల ప్రజల పై పెనుభారం పడింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చి 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నూతన సంస్కరణలు అమలు చేసే విధంగా ముందుకు వెళుతున్నారు. ఆర్టీసిని ప్రైవేటీకరణ చేయడం, నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు తీసుకురావడం, రెవెన్యూ శాఖలో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టడం. ఇవన్ని కూడా టీఆర్ఎస్ నేతలను కలవర పెడుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందేమోనని వారు గతంలో చంద్రబాబు పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా రెవెన్యూ శాఖ పై సీఎం కేసీఆర్ గతంలో వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఎమ్మార్వో విజయారెడ్డి ఘటన జరగడం కూడా ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమైంది. కానీ సీఎం కేసీఆర్ పక్కా వ్యూహంతో ముందుకు వెళుతారని, ప్రజల నాడీని పట్టుకునే గొప్ప నాయకత్వం కేసీఆర్ కు ఉందని కూడా నేతలు వారికి వారే సర్ధి చెప్పుకుంటున్నారు. దీనికి ఫలితమే హూజుర్ నగర్ ఉప ఎన్నికల ఫలితమని చర్చించుకుంటున్నారు. ఏదైమైనా నూతన సంస్కరణల ఫలితం తర్వాతి ఎన్నికల్లో పడవచ్చని నేతలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.