(Local) Sun, 20 Oct, 2019

ప్రధాని మోదీ చేతిని ముద్దాడిన కశ్మీరీ పండిట్!

September 22, 2019,   7:12 PM IST
Share on:
ప్రధాని మోదీ చేతిని ముద్దాడిన కశ్మీరీ పండిట్!

ప్రధానమంత్రి మోడీ అమెరికా చేరుకున్న నేపథ్యంలో అక్కడి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 'హౌడీ మోదీ' కార్యక్రమానికి ముందుగా సిక్కులు, కశ్మీర్ పండిట్‌లు, వోహ్రా సమాజానికి చెందినవారు ప్రధాని మోదీని కలుసుకున్నారు. సిక్కు వర్గం వారు కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుచేయడాన్ని గుర్తుచేస్తూ మోడీని అభినందించారు. అలాగే కతార్‌పూర్ కారిడార్ ఏర్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు. సిక్కువర్గంవారు మోదీని కలుసుకుని ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా కాలిఫోర్నియాలో ఉంటున్న కశ్మీరీ పండిట్ అరవింద్ చావ్లా మాట్లాడుతూ... తాము ప్రధాని నరేంద్ర మోదీకి ఒక వినతి పత్రం సమర్పించామని తెలిపారు. కాగా పీఎం నరేంద్ర మోదీ అమెరికాలో ఉంటున్న కశ్మీరీ పండిట్ల సంఘాన్ని కలుసుకున్న సందర్భంగా కశ్మీరీ పండిట్లు ఆనందం వ్యక్తం చేశారు. ఒక కశ్మీరీ పండిట్ ప్రధాని మోదీ చేతిని ముద్దాడుతూ ‘ 7 లక్షల మంది కశ్మీరీ పండిట్ల తరపున ధన్యవాదాలు అని అన్నారు. ఈ సందర్భంగా కశ్మీరీ పండిట్లు ‘నమస్తే శారదా దేవి’ శ్లోకాన్ని పఠించగా, చివరగా మోదీ ‘అగైన్ నమోనమ:’ అని అనగానే అక్కడున్నవారంతా చిరునవ్వులు చిందించారు.

సంబంధిత వర్గం
కాంగ్రెస్‌తో పాకిస్తాన్ కి సంబంధం ఏంటి   -మోడీ
కాంగ్రెస్‌తో పాకిస్తాన్ కి సంబంధం ఏంటి -మోడీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.