(Local) Tue, 27 Jul, 2021

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

August 04, 2019,   12:20 PM IST
Share on:
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు పేర్కొన్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం భగవంతుడు కల్పించాడని, తాను రాజకీయాల్లోకి అనుకోకుండానే వచ్చానని, అనుకోకుండానే ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పారు. తాను సీఎంగా ప్రజల సంక్షేమం కోసమే పని చేశానని అన్నారు.ఇకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని హెచ్ డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు హీటెక్కాయి. వాస్తవానికి సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి పనిచేసినప్పటికీ ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు.కాంగ్రెస్ పార్టీ తీరుపైనా ఎమ్మెల్యేలపైనా చాలా సార్లు అసహనం వ్యక్తం చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఒక లెక్క కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. ఇకపోతే ఇటీవల జరిగిన బలనిరూపణ పరీక్షలో కుమార స్వామి ఓడిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.