(Local) Sat, 24 Jul, 2021

యడ్యూరప్ప 1000 కోట్లు ఇస్తా అంటేనే మద్దతు ఇచ్చా ...

November 06, 2019,   3:08 PM IST
Share on:
యడ్యూరప్ప 1000 కోట్లు ఇస్తా అంటేనే మద్దతు ఇచ్చా .. ...

తన సొంత నియోజకవర్గం కృష్ణరాజ్‌పేట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు ఇస్తానని యడ్యూరప్ప  మాట ఇచ్చారని, అందుకే తాను ఆయనకు మద్దతిచ్చానని కర్నాటక ఎమ్మెల్యే నారాయణ గౌడ  అన్నారు . కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి ముందు ఒకరోజు తెల్లవారుజామున 5 గంటలకు యడ్యూరప్ప ఇంటికి తనను ఒకరు తీసుకెళ్లారని, తాము ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో యడ్యూరప్ప పూజ చేసుకుంటున్నారని గౌడ వివరించారు. ఆ తర్వాత నాతో మాట్లాడిన యడ్యూరప్ప తనకు మద్దతు ఇస్తే తాను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు.

నా నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ. 700 కోట్లు అడిగాను. దానికి ఆయన మరో రూ. 300 కోట్లు కూడా ఇస్తానని వాగ్దానం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆ డబ్బు కూడా సమకూర్చారు. అటువంటి గొప్ప వ్యక్తికి మద్దతు ఇవ్వకూడదని అంటారా..అందుకే మద్దతిచ్చాను. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి తనకేమీ తెలియదని యడ్యూరప్ప అనడం సబబే అని గౌడ చెప్పారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.