(Local) Thu, 24 Sep, 2020

ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు సంస్థకు కేసు అప్పగింత -యడ్యూరప్ప

August 19, 2019,   4:15 PM IST
Share on:
ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు సంస్థకు కేసు అప్పగింత  ...

కర్ణాటకలో జెడిఎస్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం పాలించిన సమయంలో ఫోన్ టాపింగ్ జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప  ఆదివారం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఈ చర్య తీసుకుం ది. ‘కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు సిద్దరామయ్యతో సహా అనేకమంది నాయకులు …టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరగాలని, నిజం బయటికి రావాలని డిమాం డ్ చేశారు. కనుక దర్యాప్తు జరిపించాలని నిర్ణయించుకున్నాను. రేపే దర్యాప్తునకు ఆదేశిస్తా ను’ అని యడ్యూరప్ప ఆదివారం విలేకరులకు చెప్పారు. సమగ్రమైన దర్యాప్తు జరగాలని, నిందితులకు శిక్షపడాలని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారని కూడా కర్ణాటక సిఎం అన్నారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.