(Local) Mon, 30 Nov, 2020

కర్నాటక బిజెపి అధ్యక్షుడిగా ఎంపి నళిన్ కుమార్

August 21, 2019,   12:43 PM IST
Share on:
కర్నాటక బిజెపి అధ్యక్షుడిగా ఎంపి నళిన్ కుమార్

కర్నాటక బిజెపి అధ్యక్షుడిగా ఎంపి నళిన్ కుమార్ కటీల్‌ను నియమించారు. ఇంతకు ముందు కర్నాటక బిజెపి అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్పకు సిఎం పదవి దక్కడంతో ఆ పదవి ఖాళీగా ఉంది. దీంతో బిజెపి అధిష్టానం పలుమార్లు కసరత్తు చేసిన తరువాత ఎంపి నళీనిని అధ్యక్షుడిగా నియమించింది. లోక్ సభ ఎన్నికలలో నళిన్ దక్షిణ కన్నడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను నళిన్ పొగడడంతో బిజెపి అధిష్టానం చేత ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. గాంధీని చంపిన గాడ్సేనా, 72 మంది పొట్టనబెట్టుకున్న కసబా, 17000 మందిని ఊచకోత కోసిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీలలో  ఎవరు క్రూరమైనవారని నళిన్ గతంలో ప్రశ్నించారు. దీంతో ఆయనపై బిజెపి అధిష్టానం మండపడడంతో సోషల్ మీడియాలో ఆయన క్షమాపణ చెప్పారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.