(Local) Thu, 29 Oct, 2020

బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం

November 28, 2019,   9:40 AM IST
Share on:
బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బోరున విలపించారు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భాగంగా మాండ్యలో ప్రచారంలో పాల్గొన్న ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చారు. మండ్యా నుంచి పోటీ చేసిన తన కొడుకును ఓడించి ప్రజలు నన్ను విడిచి పెట్టారని భావోద్వేగానికి గురయ్యారు. కేఆర్ పేట ఉప ఎన్నిక సందర్భంగా ఆ స్థానం నుంచి జేడీఎస్ తరపున పోటీ చేస్తున్న బీఎల్ దేవరాజ్ తరపున ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నా కొడుకును ఓడించి నన్ను వదిలి పెట్టారని.. నా కుమారుడు నిఖిల్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని నేను అనుకోలేదు.. కానీ మీరు పట్టుబట్టడం వల్లే నిలబెట్టాను. నేనేం తప్పు చేశానని ఓడించారు. అయినా నా బాధంతా ఓడిపోయిన నా కుమారుడి గురించి కాదు, ఇక్కడి ప్రజల గురించేనని.. సీఎం పదవి కన్నా మీ ప్రేమాభిమానాలే నాకు ముఖ్యమన్నారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.