(Local) Fri, 22 Oct, 2021

నేను అనేది మనంగా మారితే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది - కమల్

August 07, 2019,   1:44 PM IST
Share on:
నేను అనేది మనంగా మారితే అసాధ్యం కూడా సాధ్యం అవుతుం ...

కోలీవుడ్  చిత్ర పరిశ్రమలో రజనీకాంత్ తో  తాను 40 ఏళ్లపాటు కలిసి పనిచేశానని , రాజకీయాల్లోనూ ఇలా కలిసి నడిచేందుకు ప్రయత్నిస్తానని తమిళ సూపర్ స్టార్  కమల హాసన్ పేర్కొన్నారు. బిగ్‌బాస్ షోలో భాగంగా పోటీదారులు తమను తాము ప్రముఖులుగా ఊహించుకుంటూ కమలహాసన్‌ను ఇంటర్వ్యూ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌గా మారిన దర్శకుడు చేరన్.. కమల్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా చేరన్ (రజనీకాంత్) కమల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నటులుగా నాలుగు దశాబ్దాలపాటు కలిసి ప్రయాణించిన మనం ప్రజల ఆకాంక్షలను పూర్తి చేశామని, తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే, మీరు వచ్చేశారని అన్నాడు. నటులుగా ప్రజలను సంతృప్తి పరచడంలో విజయం సాధించిన మనం నాయకులుగానూ ఆ పని చేయగలమా? అని కమల్‌ను ప్రశ్నించాడు.దీనికి కమల్ బదులిస్తూ.. అలా చేయడం కచ్చితంగా సాధ్యమేనని అన్నారు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని, నేను అనేది మనంగా మారితే అది సాధ్యమవుతుందంటూ పరోక్షంగా రజనీతో కలిసి పనిచేయడం తనకిష్టమన్న సంకేతాలు ఇచ్చారు.

సంబంధిత వర్గం
ఉద్యమకారులకు మద్దతుగా  ట్రంప్‌
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.