(Local) Wed, 20 Oct, 2021

ఎన్టీఆర్ చుట్టూ ఏపీ రాజకీయం

November 22, 2019,   2:00 PM IST
Share on:
ఎన్టీఆర్ చుట్టూ ఏపీ రాజకీయం

జూనియర్ ఎన్టీఆర్.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జోరుగా వినపడుతున్న పేరు. సినిమాల్లో బిజీగా గడుపుతున్న ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అటు వైసీపీ.. ఇటు టీడీపీ.. ఎన్టీఆర్ రాజకీయ పునఃప్రవేశంపై తమకు తోచినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు తెర మీదకు రాని ఎన్టీఆర్ పేరు ఇప్పుడే తెర మీదకు రావడానికి ప్రధాన కారణం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే. జూనియర్ ఎన్టీఆర్‌ రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశాడని వంశీ అనడంతో ఎన్టీఆర్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అదే సమయంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మీడియా ముందుకు వచ్చి టీడీపీకి ఎన్టీఆర్ అవసరం లేదని అనడంతో చర్చ మరింత వేడెక్కింది. వాస్తవానికి.. చంద్రబాబు తర్వాత అంత సమర్థవంతమైన నాయకుడు ఎవరన్నది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలింది. ఆయన తనయుడు లోకేష్ పార్టీ బాధ్యతలు చేపడతారని అంతా అనుకున్నారు. అయితే.. ఆయన శక్తి, సామర్థ్యాలపై నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదీకాక.. తాను పోటీ చేసిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోవడం ఆయన నాయకత్వంపై అనుమానాలు మరింతగా ఎక్కువయ్యాయి. 2009లో ఎన్టీఆర్ ప్రచారం చేయగా.. అతడికి ప్రజలు జేజేలు పలికారు. తాతకు తగ్గ మనవడిగా.. ఆయనంతటి వాక్పటిమ ఉండటం పార్టీకి కలిసి వస్తుందన్న అభిప్రాయం ఉంది. ఇక ఎన్టీఆర్ ఏం అంటాడో వేచి చూడాలి మరి..

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.