(Local) Sat, 26 Sep, 2020

జనసేన పార్టీకి బలం జనసైనికులే - పవన్ కల్యాణ్ ...

August 17, 2019,   3:23 PM IST
Share on:
జనసేన పార్టీకి బలం జనసైనికులే - పవన్ కల్యాణ్ ...

సమాజం కోసం తపించే వ్యక్తులు ఆకలి బాధలతో రోడ్ల మీదపడి చచ్చిపోతుంటే.. సమాజాన్ని దోచేసే వ్యక్తులు అందలం ఎక్కి ఏలుతున్న రోజులు ఇవని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కల్యాణ్  పేర్కొన్నారు.

వేల కోట్లు దోచేసి సడన్ గా నిజాయతీపరులు అయిపోయాం, నీతివంతమైన పాలన అందిస్తామంటే ప్రజలు నమ్మరన్నారు. మూలాలన్నీ అవినీతి మూలాలు అయినప్పుడు మంచి పని చేయడానికి కూడా ప్రకృతి సహకరించదని అన్నారు. న్యూటన్ మూడో సూత్రం ప్రకారం చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుందని అనుభవించక తప్పదని అన్నారు. శుక్రవారం సాయంత్రం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మచిలీపట్నం పార్లమెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు, కార్యక‌ర్తలతో స‌మావేశమయ్యారు. 

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ "జనసేన పార్టీ స్థాపించడానికి ప్రభావితం చేసిన వ్యక్తుల్లో చాలా కీలకమైన వ్యక్తి ఒకరు మచిలీపట్నంవాసి. విలువలతో కూడిన రాజకీయం చేయాలన్న స్ఫూర్తి ఈ ప్రాంతం నుంచే పుట్టింది. జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 0.9 శాతం ఓటింగ్ వస్తే.. మచిలీపట్నంలో జనసేనకు 14 నుంచి 15 శాతం ఓటింగ్ వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేసిన  జన సైనికులకు కృతజ్ఞతలు. మనం గుండెలకు హత్తుకునే త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య గారు ఈ ప్రాంతం వారే. చివరి రోజుల్లో ఆకలి బాధలతో ఆయన మరణించడం బాధాకరం. ఆయన ఎప్పుడు గుర్తింపు కోరుకోలేదు. అలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని జనసేన పార్టీ ముందుకు కదులుతుంది. అవినీతిలేని, సిఫార్సు లేని పాలన తీసుకురావడమే జనసేన పార్టీ లక్ష్యం అని అన్నారు.

 

సంబంధిత వర్గం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.