(Local) Mon, 26 Aug, 2019

జనసేన ఎమ్యెల్యేని తిట్టిన ఎస్.ఐ --పోలీస్ స్టేషన్ ముట్టడి

August 12, 2019,   2:15 PM IST
Share on:

తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. తన అనుచరులు, జనసేన కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి మలికిపురం పోలీస్ స్టేషన్ ని  ముట్టడించారు. మలికిపురం ఎస్ఐ రామారావు తీరుపై రాపాక తీవ్రంగా మండిపడ్డారు. ఒక కేసు విష‌య‌మై మలికిపురం ఎస్ఐ రామారావుకు ఎమ్మెల్యే ఫోన్ చేయాగా ఎకవచనంతో మాట్లాడి అసభ్య పదజాలంతో దూషించాడంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. దింతో మలికిపురం పోలిస్ స్టెషన్ వద్దకు చేరుకుని ఎస్ఐ రామారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామారావును సస్పెండ్ చేయాలంటూ జనసేన కార్యకర్తలు పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. రామారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో వెంటనే జిల్లా ఎస్పీ జోక్యం చేసుకున్నారు. రాపాకకు ఫోన్ చేసి.. ఘటనకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. తాను ధర్నాకు దిగడానికి ఏర్పడిన పరిస్థితులను ఎస్పీకి వివరించారు. దీనిపై తాను స్వయంగా విచారిస్తానని, ఆందోళనలు ఆపాలంటూ ఎస్పీ కోరారు. అయినప్పటికీ- రాపాక, ఆయన అనుచరులు శాంతించలేదు. ఎస్సైని సస్పెండ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు.
 

సంబంధిత వర్గం

వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకి జనసేన ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.