(Local) Wed, 20 Oct, 2021

జమ్మూ, లడఖ్ ప్రాంతాలు దేశానికి మణిమకుటాలు : మోదీ

October 14, 2019,   1:03 PM IST
Share on:
జమ్మూ, లడఖ్ ప్రాంతాలు దేశానికి మణిమకుటాలు : మోదీ

ప్రధాని మోదీ మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ కాంగ్రెస్, ఎన్సీపీలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు జమ్మూలో ఆర్టికల్  370 ని తిరిగి తీసుకొస్తామని వ్యాఖ్యానించాయని, వారి మొసలి కన్నీళ్లతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు 370 తిరిగి తీసుకురాలేరని, భారత ప్రజలు అందుకు అంగీకరించరని విరుచుకుపడ్డారు. జమ్మూ, లడఖ్ ప్రాంతాలు కేవలం భారత భూభాగాలు మాత్రమే కాదని, ఆ రెండూ దేశానికి మణిమకుటాలని ప్రధాని అభివర్ణించారు. ఈ సందర్భంగా మోడీ రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి, ఫడ్నవీస్‌ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని మోదీ మహారాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే న్యూ ఇండియా జోష్ మోదీ వల్ల కాదని, కేవలం ప్రజల ఓటు ద్వారానే సాధ్యమవుతుందని మోదీ స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.