(Local) Mon, 12 Apr, 2021

జమ్మూ కాశ్మీర్ విభజన పిటిషన్లపై విచారణ వాయిదా

October 02, 2019,   3:04 PM IST
Share on:
జమ్మూ కాశ్మీర్ విభజన పిటిషన్లపై విచారణ వాయిదా

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ, కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జమ్మూ- కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటును నిలిపివేయలేమని స్పష్టం చేసింది. 9 పిటిషన్లు సహా కాశ్మీర్ పరిస్థితులపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. వ్యాజ్యలపై విచారణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోనున్నాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.