(Local) Tue, 27 Oct, 2020

ఐఎస్ఐ హిట్ లిస్ట్ లో జమ్మూ గవర్నర్!

November 08, 2019,   10:25 AM IST
Share on:
ఐఎస్ఐ హిట్ లిస్ట్ లో జమ్మూ గవర్నర్!

పాక్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ ఉగ్రవాద సంస్థలను జమ్మూకశ్మీర్ కొత్త గవర్నరుగా నియమితులైన గిరీష్ చంద్ర మూర్మును లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని ఆదేశించిందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో కోట్లీ ప్రాంతంలో సమావేశమైన ఐఎస్ఐ అధికారులు గవర్నరు జీసీ మూర్ముపై దాడికి వ్యూహరచన చేసినట్లు సమాచారం. లష్కరే తోయిబా, హిజ్బుల్ ఉగ్రవాదులకు ఐఎస్ఐ అందజేసిన హిట్ లిస్టులో జమ్మూ కశ్మీర్ గవర్నరు జీసీ మూర్ముతోపాటు పలువురు బీజేపీ ప్రముఖ నాయకులు, ఇటీవల కొత్తగా ఎన్నికైన బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సభ్యులు కూడా ఉన్నారని కేంద్ర ఇంటలిజెన్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్న గవర్నరుతోపాటు బీజేపీ నాయకులకు భారీ భద్రత కల్పించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.