(Local) Sun, 20 Oct, 2019

రహాస్యంగా మసూద్ అజార్ ను రిలీజ్ చేసిన పాక్

September 09, 2019,   12:56 PM IST
Share on:
రహాస్యంగా మసూద్ అజార్ ను రిలీజ్ చేసిన పాక్

అంతర్జాతీయంగా తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని నటిస్తూనే పాకిస్థాన్ మళ్లీ కుక్క తోక వంకర అన్నట్లుగా వ్యహరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆగమేఘాల మీద అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నించి, ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏకాకిగా మిగిలిన పాకిస్థాన్ కుట్రలకు తెరలేపుతోంది. జైషే మహ్మద్ అధినేతను అరెస్ట్ చేసినట్లు కొద్దిరోజుల కిందే ప్రకటించిన పాకిస్థాన్ ఇప్పుడు రహస్యంగా విడుదల చేసింది. ఈ మేరకు ఐబీ హెచ్చరికలు జారీ చేసి ప్రభుత్వానికి సమాచారం అందించింది. రాజస్థాన్ సమీపంలో ఇండియా-పాకిస్థాన్ సరిద్దుల్లో పెద్ద కుట్రకు పాకిస్థాన్ ప్లాన్ చేసినట్లు తెలిపింది. దీంతో సరిహద్దు వెంబడి భారత సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది.
భారత్ కు ధీటైన జవాబిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన రెండ్రోజుల్లోనే రహస్యంగా మసూద్ అజర్ ను విడుదల చేసింది. భారత్ లో పెద్ద కుట్రకు ప్లాన్ చేసే మసూద్ అజర్ ను పాక్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థలకు దిశా నిర్దేశం చేసేందుకే మసూద్ అజార్ ను ను రిలీజ్ చేసినట్లు ఐబీ అధికారులు పేర్కొన్నారు. దీంతో భారత్- పాక్ సరిహద్దులతో పాటు దేశవ్యాప్తంగా భద్రతను కట్టు దిట్టం చేశారు.

సంబంధిత వర్గం
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.