(Local) Wed, 21 Aug, 2019

నితిన్‌ గడ్కరీతో సమావేశమైన జగన్‌

August 07, 2019,   4:12 PM IST
Share on:

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రితో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులపై చర్చించారు.దాదాపు గంటసేపు వీరి సమావేశం కొనసాగింది. సమావేశానంతరం మంత్రి గడ్కరీ ద్వారం బయటకు వచ్చి సీఎం జగన్‌కు వీడ్కోలు పలికారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి, రఘురామకృషంరాజు, సురేష్‌, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణంబాబు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రమేష్‌ బాబు పాల్కొన్నారు. అంతకు ముందు సీఎం జగన్‌ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు.

సంబంధిత వర్గం

మద్యం దుకాణాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తుల ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.