(Local) Mon, 27 Sep, 2021

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు ఇంట్లో ఐటీ సోదాలు

November 20, 2019,   11:37 PM IST
Share on:
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు ఇంట్లో ఐటీ సోదాలు

ఈ మధ్య ఐటీ సోదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోజు సినీ రంగం ప్రముఖుల ఇళ్లలో కూడా ఇట్ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. పన్ను ఎగవేత, ఇతర అక్రమాల కేసుల్లో ఆదాయ పన్ను అధికారులు హైదరాబాద్‌లోని ప్రముఖులపై దృష్టి సారించారు.  హీరో నాని, నిర్మాత దగ్గుబాటి సురేశ్ ఆఫీసుల్లో సోదాలు జరిపిన అధికారులు కూకట్‌పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి ఆయన ఇంటికి ఆకస్మికంగా చేరుకున్న అధికారులు డాక్యమెంట్లు, ఇతర లావాదేవీల వివరాలు రాబడుతున్నారు. కృష్ణారావు కొడుకు సందీప్ రావు.. ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో డైరెక్టర్‌గా ఉన్నారు. సందీప్‌తోపాటు మరో ఐదుగురు డైరెక్టర్ల ఇళ్లపై దాడులు సాగుతున్నాయి. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సంబంధిత వర్గం
దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఐటి దాడులు...
దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఐటి దాడులు...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.