(Local) Sat, 24 Jul, 2021

కార్టోశాట్‌-3 ప్రయోగం వాయిదా

November 22, 2019,   1:38 PM IST
Share on:
కార్టోశాట్‌-3 ప్రయోగం వాయిదా

కార్టోశాట్‌-3 ప్రయోగ తేదీని  రెండు రోజులు ఆలస్యంగా  చేపట్టనున్నట్లు ఇస్రో చెప్పింది. వాస్తవానికి ఈ నెల 25 వ తేదీన ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా.. షెడ్యూల్‌ను మారుస్తూ... తాజాగా ఇస్రో తన ట్వీట్‌లో కొత్త తేదీని ప్రకటించింది. ఈ నెల 27 వ తేదీన ఉదయం 9 గంటల 28 నిమిషాలకు కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఉన్న రెండవ లాంచ్‌ ప్యాడ్‌ నుంచి కార్టోశాట్‌ 3 నింగిలోకి దూసుకువెళ్తుంది. 
కార్టోశాట్‌-3 తో పాటు మరో 13 కమర్షియల్‌ నానోశాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. హై రెజల్యూషన్‌ ఇమేజింగ్‌ సామర్థ్యం ఉన్న ఉపగ్రహంగా కార్టోశాట్‌-3ని రూపొందించారు. ఇది థార్డ్‌ జనరేషన్‌కు చెందినది. కార్టోశాట్‌-2 ఉపగ్రహంతో పోలిస్తే కార్టోశాట్‌-3 అత్యంత అధునాతనమైంది. దీంట్లో హై రిజల్యూషన్‌ వ్యవస్థ ఉంటుంది. దీంతో 25 సెం. మీ. రిజల్యూషన్‌తో, 16 కి.మీ. పరిధిలో ఈ ఉపగ్రహం ఫొటోలు తీస్తుంది. కార్టోశాట్‌-3లో మల్టీస్పెక్ట్రల్‌ (విద్యుదయస్కాంత స్పెక్ట్రవ్న్‌ పరిధిలోపల చిత్రాల్ని తీయడం), హైపర్‌ స్పెక్ట్రల్‌ (విద్యుదయస్కాంత స్పెక్ట్రవ్న్‌ పరిధిని దాటి చిత్రాలు తీయడం) వంటి అధునాతన వ్యవస్థలు ఉన్నాయి. దీంతో ఉగ్రవాద శిబిరాలు, దాక్కున్న శత్రువులకు సంబంధించిన ఫొటోలను జూవ్న్‌ (పెద్దగా) చేసి తీసే వీలు కలుగుతుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.