(Local) Sat, 24 Jul, 2021

మాట నిలబెట్టుకున్న రైల్వేస్

October 22, 2019,   3:53 PM IST
Share on:
మాట నిలబెట్టుకున్న రైల్వేస్

అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తేజన్‌ రైళ్లు గంట కంటే ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తామని ప్రకటించిన రైల్వే ఇచ్చిన మాట నిలబెట్టుకొంది. ఈ నెల 19న లఖ్‌నవూ-దిల్లీ-లఖ్‌నవూ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రండు వైపులా ఆలస్యమయింది. ఉదయం 6.10 గంటలకు లఖ్‌నవూలో బయళ్టేరాల్సిన రైలు 9.55కి బయల్దేరింది. దీంతో దిల్లీకి చేరడంలోనూ, అక్కడి నుంచి బయల్దేరడంలో, మళ్లీ లఖనవూకు రావడంలోనూ ఆలస్యమయింది. ఆలస్యాన్ని బట్టి లఖ్‌నవూ-దిల్లీ రైల్లో 450 మందికి రూ.250 చొప్పున, దిల్లీ-లఖ్‌నవూ రైల్లో 500 మందికి రూ.100 చొప్పున మొత్తం రూ.1.62 లక్షలను బీమా సంస్థ ద్వారా ఐఆర్‌సీటీసీ చెల్లించనుందని రైల్వేశాఖ సోమవారం ప్రకటించింది. కాగా రైళ్ల ఆలస్యానికిగానూ పరిహారమివ్వడం రైల్వే చరిత్రలో ఇదే తొలిసారి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.