(Local) Wed, 20 Oct, 2021

గోల్డెన్‌ చారియెట్‌ రైలు త్వరలో ప్రారంభం

November 22, 2019,   9:42 AM IST
Share on:
గోల్డెన్‌ చారియెట్‌ రైలు త్వరలో ప్రారంభం

2018లో కోట్లాది రూపాయల నష్టం కారణంగా నిలిచిపోయిన గోల్డెన్‌ చారియెట్‌ రైలును దేశ విదేశాల పర్యాటకుల కోసం తిరిగి ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు భారతీయ రైల్వే కేటరింగ్‌ టూరిస్ట్‌ కార్పొరేషన్‌, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ రైలు బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ప్రారంభమై బందీపురా, మైసూరు, హళేబీడు, చిక్కమగళూరు, హంపి, విజయపురల మీదుగా గోవా వరకు ప్రయాణిస్తుంది. ఐఆర్‌సిటిసికి రైలు సంచార బాధ్యతను పూర్తిగా అప్పగించనున్నారు. వచ్చే ఏడాది నాటికి ప్రయాణ చార్జీలను కొంత మేరకు తగ్గించి మళ్ళీ ఈ రైలును నడపాలని సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.