(Local) Thu, 21 Nov, 2019

రైతు భరోసా ప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం

August 13, 2019,   5:21 PM IST
Share on:
రైతు భరోసా ప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకు వస్తున్న రైతు భరోసా కార్యక్రమానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. సంక్షేమ పథకాల అమలుపై సీఎం జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్ 15న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ ని ఆహ్వానించామని సీఎం జగన్ తెలిపారు. దేశం మొత్తం రైతు భరోసా కార్యక్రమం వైపు చూడాలని… ఎక్కడా పొరపాటు జరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని జగన్ అన్నారు. గ్రామ సచివాలయంలో కౌలు రైతులకు కార్డులు ఇస్తారని.. కార్డులు అందగానే వారు రైతు భరోసాకు అర్హులు అవుతారని సీఎం స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.