(Local) Wed, 03 Mar, 2021

అరుణ్ జైట్లీ కన్నుమూత

August 24, 2019,   12:40 PM IST
Share on:
అరుణ్ జైట్లీ కన్నుమూత

సుష్మా స్వరాజ్ మరణాన్ని మరవకముందే BJPలో మరో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీ ఎయిమ్స్‌లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

1952 డిసెంబరు 28న మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రత్నప్రభ దంపతులకు అరుణ్‌ జైట్లీ జన్మించారు. తండ్రి న్యాయవాది. 1960 నుంచి 1969 మధ్య కాలంలో పాఠశాల చదువంతా దిల్లీలోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో సాగింది. 1973లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1977లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఇదే సమయంలో ఏబీవీపీ నిరసనకారుడిగా ఉన్నారు. 1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1982 మే 24లో అరుణ్‌ జైట్లీకి సంగీత డోగ్రీతో వివాహం జరిగింది. 

న్యాయ విద్య పూర్తయ్యాక 1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు సహా, కొన్ని హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1990లో దిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ హోదా లభించింది.1991 నుంచి జైట్లీ భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్‌ హోదా దక్కింది. 2009 జూన్‌ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.