(Local) Wed, 21 Apr, 2021

ఐరాస వేదికగా పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్

November 07, 2019,   3:06 PM IST
Share on:
ఐరాస వేదికగా పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్

ఎన్ని రోజులైనా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడంలేదు . ఆ దేశ రాజకీయ, ఆర్థిక సంక్షోభం నుంచ ప్రజలను ఏమార్చడానికి కశ్మీర్ అంశాన్ని అడ్డం పెట్టుకుంటుంది. అయినా, భారత్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ప్రతి వేదికపై పాక్‌కు గట్టి సమాధానమే ఇస్తూ వస్తోంది. తాజాగా ఐరాస భద్రతా మండలి సమావేశంలో పాక్ రాయబారి మలీహా లోదీ మాట్లాడుతూ.. కశ్మీర్‌లో మహిళల హక్కులను భారత్ హరిస్తోందంటూ లేనిపోని ఆరోపణలు చేశారు. దీనిపై భారత్ స్పందిస్తూ ఘాటైన సమాధానమే ఇచ్చింది. రాజకీయ ప్రయెజానాల కోసం మహిళల గొంతులు నొక్కి, ఉగ్రవాదాన్ని పెంచిపోషించే ఓ దేశం నీతులు చెబుతుందంటూ భారత రాయబారి పలోమీ త్రిపాఠి పరోక్షంగా పాక్‌ని కడిగి పారేశారు. పాక్ వైఖరితో భారత్‌లో వేల కుటుంబాలు నష్టపోయాయని తెలిపారు. ఎజెండాకు విరుద్దంగా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి పాక్ రాజకీయం చేస్తోందని స్పష్టం చేశారు. పాక్ అభ్యంతరాలను భద్రతమండలి గతంలో పెద్దగా పట్టించుకోలేదని.. అదే వైఖరిని భవిష్యత్తులోనూ కోనసాగిస్తుందని ఆశిస్తోందన్నారు.
           ఎజెండాలో ఉన్న అంశాలపై మాట్లాడుతూ.. మహిళలపై హింసకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థల్ని యూఎన్ఎస్పీ అధికారికంగా గుర్తించాల్సిన అవసరం ఉందని త్రిపాఠి గుర్తు చేశారు.  మహిళలపై ఉగ్రవాదులు జరుపుతున్న హింస ఇంకా కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు. దీన్ని అరికట్టడానికి భారత్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే ఐరాస శాంతి స్థాపన మిషన్‌లో మహిళల పాత్ర పెరగాల్సిన అవసరం ఎంతైన ఉందని నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఐరాస శాంతి స్థాపన మిషన్ మిలిటరీలో కేవలం 4.2 శాతం మంది స్త్రీలే ఉండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఐరాస శాంతి స్థాపన కార్యక్రమాల్లో మహిళల్ని భాగం చేయడానికి భారత్ కటుబడి ఉందన్నారు. అందులో భాగంగా గతేడాది కాంగోకు ప్రత్యేక దళాన్ని పంపిన విషయాన్ని గుర్తుచేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.