
జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు అనంతరం జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలు కావడంతో గోల్కొండ కోటలో నిర్వహించనున్న జెండా వందనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యుత్, జిహెచ్ఎంసి, అటవీ శాఖ అధికారులు తెలిపారు. గోల్కొండకు వెళ్లే మార్గాల రోడ్లకు మరమ్మతులు, పారిశుద్ధ్యం పనులను జిహెచ్ఎంసి అధికారులు చేపట్టారు. ప్రత్యేక ఆకర్షణ కోసం పలు రకాల పూల మొక్కలు, లైట్ల ఏర్పాట్లు, గోల్కొండ కోటను మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. వివిఐపి, విఐపిలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారి వచ్చే మార్గాల్లో సామాన్యులు రాకుండా ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రానున్న మార్గాల్లో జాగిలాలతో ప్రత్యేక పోలీసుల బృందం తనిఖీలు చేసింది. జెండా ఆవిష్కరణ చేసే ప్రాంతాన్ని, పోలీసుల గౌరవ వందనం చేసే ప్రాంతాన్ని అనువణువునా పోలీసులు తనిఖీ చేశారు.
విఐపిలు, మంత్రులు, అతిథిలు రానుండడంతో ఆ మార్గాలపై దృష్టి సారించారు. వీరు వచ్చే మార్గాల్లో ఉదయం 8 గంటల నుంచి 12 వరకు ఎవరినీ అనుమతించకుండా ఆంక్షలు విధించారు. వారి కోసం కోటకు సమీపంలోని వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. వాటిని కూడా పరిమిత సంఖ్యలోనే వాహనాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. పోలీసు బలగాలు మఫ్టీలో, మహిళా పోలీసులను కూడా బందోబస్తులో భాగంగా నియమించారు. సిసికెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు, మొబైల్ వాహనాల్లో ఆయా ప్రాంతాల్లో సిసికెమెరాలతో అనువణువు చిత్రీకరించనున్నారు. అనుమానస్పదంగా కన్పించిన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించేందుకు మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు.
ఇండిపెండెన్స్ డే పరేడ్‌కు వచ్చే వారు తమ వెంట ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు వచ్చే వారు తమతో హ్యాండ్ బ్యాగులు, బ్రీఫ్ కేసులు, కెమెరాలు, టిఫిన్ క్యారియర్లు తదితర వస్తువులు తీసుకురావద్దని కోరారు. ఎవరైనా వస్తువులు తీసుకువస్తే వాటిని తప్పనిసరిగా తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్స వేడుకలు ప్రశాంతం గా జరిగేలా ప్రజలు పోలీసులకు తమవంతు సహకారాన్ని అందిచాలని, భద్రతా చర్యల్లో భాగంగా పలు ఆంక్షలు విధించామని తెలిపా రు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ట్రాఫిక్ ఆంక్ష లు కూడా ఉంటాయని తెలిపారు. వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏరియాలను కేటాయించామని పేర్కొన్నారు. ఎ,బి,సి,డి పాస్‌ల వారీగా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే తమ వాహనాలను నిలుపుకుని పోలీసులకు సహకరించాలని సిపి తెలిపారు.
-
మ్యూజియంగా బాపూ బస చేసిన భవంతి
01 Oct 2019, 2:54 PM
-
దేశ ప్రజలకు టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకా ...
15 Aug 2019, 12:40 PM
-
ఎర్రకోట వేదికగా ప్రధాని కీలక నిర్ణయం
15 Aug 2019, 12:17 PM
-
రాష్ట్రపతి కోవింద్ స్వాతంత్య్ర సందేశం
15 Aug 2019, 10:42 AM
-
స్వాతంత్ర దినోత్సవం నాడు వాల్మీకి టీజర్...
13 Aug 2019, 12:26 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

మ్యూజియంగా బాపూ బస చేసిన భవంతి

స్వాతంత్ర దినోత్సవం నాడు వాల్మీకి టీజర్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.