(Local) Fri, 18 Jun, 2021

ట్రంప్‌ హయాంలో అత్యధికంగా హెచ్‌-1బి వీసాలు తిరస్కరణ

November 06, 2019,   1:53 PM IST
Share on:
ట్రంప్‌ హయాంలో అత్యధికంగా హెచ్‌-1బి వీసాలు తిరస్కర ...

నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ చేపట్టిన ఓ అధ్యయనంలో ట్రంప్‌ హయాంలో అమెరికాలో వీసా తిరస్కరణలు ఎక్కువగా జరిగినట్లుగా గుర్తించింది. అమెరికాలో వలసలను తగ్గించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకుగాను ట్రంప్‌ సర్కార్‌ వీసా నిబంధనలలో మార్పులు చేసిన విషయం విదితమే. కాగా ఈ నిర్ణయం వలన హెచ్‌-1బి వీసాలు అధికంగా తిరస్కరణకు గురైనట్లుగా, అందులో అధికంగా భారతదేశానికి చెందిన ఐటీ కంపెనీల నుంచి వచ్చినవేనని ఓ నివేదికలో పేర్కొంది. విప్రో చేసిన వాటిల్లో తిరస్కరణలు అత్యధికంగా 53 శాతానికి పెరిగినట్లుగా, తరువాతి స్థానంలో ఇన్ఫోసిస్‌ 45 శాతానికి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ 34 శాతం, టెక్‌ మహింద్ర 41శాతానికి పరిమితమయ్యాయి. కాగా ఈ తిరస్కరణలు 2015 వరకు 8శాతానికి మించి దాటలేదని, ట్రంప్‌ సర్కార్‌లో మాత్రమే ఇవి పెరిగాయని, వలస విధానాల్లోని కఠిన నిబంధనలు, పాలసీల్లోని మార్పుల కారణంగా ట్రంప్‌ ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరిందని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ అభిప్రాయపడింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.