(Local) Wed, 22 Jan, 2020

భారత్ యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది...ఇమ్రాన్ ఖాన్

August 10, 2019,   12:22 PM IST
Share on:
భారత్ యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది...ఇమ్రాన్ ఖాన్

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. యుద్ధం వంటి పరిస్థితిని భారత్ సృష్టిస్తున్నదని ఆరోపించారు. పాకిస్థాన్‌కు చెందిన కొందరు జర్నలిస్టులతో ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడారు. పుల్వామా ఘటన అనంతర పరిణామాల మాదిరిగా కశ్మీర్‌లో ఏమి జరుగుతున్నది అన్నది తెలియకుండా ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. యుద్ధం ముప్పు నిజంగా పొంచి ఉంది. అలాంటి పరిస్థితిని మేము కచ్చితంగా ఎదుర్కొంటాం. ఇలాంటి కారణాలు రెండు దేశాల మధ్య గతంలో యుద్ధానికి ఎలా దారి తీశాయో మనం చూశాం అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతోనే ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై భారత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నదని ఆయన ఆరోపించారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు తాము చాలా ప్రయత్నించామని, అయితే భారత్ ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదు అంటూ వ్యాఖ్యానించారు.

సంబంధిత వర్గం
కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ సమావేశం
కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ సమావేశం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.