(Local) Mon, 23 Nov, 2020

భారత ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన ఇమ్రాన్

August 22, 2019,   2:46 PM IST
Share on:
భారత ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన ఇమ్రాన్

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  భారత ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. కశ్మీర్ లో అమాయక ప్రజలను భారత బలగాలు అణచివేస్తున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అందులో భాగంగా ఇటీవల జరిగిన బక్రీద్ను కూడా స్వేచ్ఛగా జరుపుకోనివ్వలేదని విమర్శించారు. మతం కారణంగా హింసకు గురయ్యేవారికి ప్రపంచం సంఘీభావం తెలుపుతోందన్న ఇమ్రాన్, భారత్ పరిధిలోని కశ్మీర్ లోనూ అణచివేతను నిలువరించాలని పిలుపునిచ్చారు. నేడు మతం కారణంగా హింసకు గురైన బాధితుల దినోత్సవం నేపథ్యంలో లక్షలాది మంది కశ్మీరీలు భారత్ పాలనలో అణచివేతకు గురికావడంపై దృష్టి సారించాల్సిందిగా ప్రపంచదేశాలను ఇమ్రాన్ ఖాన్ కోరారు. భారత ప్రభుత్వం కశ్మీరీల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను నిరాకరిస్తోందనీ, తీవ్రమైన హింసకు పాల్పడుతోందని ఇమ్రాన్ ఆరోపించారు. 

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.