(Local) Fri, 17 Sep, 2021

ట్రంప్ కు భారీ జరిమానా

November 09, 2019,   10:09 AM IST
Share on:
ట్రంప్ కు భారీ జరిమానా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని రెండు మిలియన్‌ డాలర్లు స్వచ్చంద సంస్థలకు చెల్లించాలని న్యూయార్క్‌ కోర్టు ఆదేశించింది. ట్రంప్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ట్రంప్‌ ఫౌండేషన్‌కు వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ జేమ్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిధుల్ని వాడుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిన్‌ సాలియన్‌ స్కార్పుల్లా మొత్తం ఎనిమిది స్వచ్చంద సంస్థలకు ట్రంప్‌, ఆయన కుటుంబ సభ్యులు రెండు మిలియన్‌ డాలర్లు చెల్లించాలని తీర్పు వెలువరించారు. దీనిపై స్పందించిన ట్రంప్‌ అటార్నీ జనరల్‌ కావాలనే తీర్పును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.