(Local) Mon, 26 Jul, 2021

నా రాజకీయ ప్రయాణానికి అభిమానమే కొలమానం - పవన్ కల్యాణ్

August 06, 2019,   12:12 PM IST
Share on:
నా రాజకీయ ప్రయాణానికి అభిమానమే కొలమానం - పవన్ కల్య ...

జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి మహానుభావులు ఏనాడు చట్టసభలకు వెళ్లాలని అనుకోలేదని, ప్రజలు  బాగుండాలని మాత్రమే ఆశించి త్యాగాలు చేశారు కాబట్టే భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారని పవన్ కల్యాణ్ అన్నారు .అక్రమంగా వేలకోట్లు సంపాదించడానికో, అడ్డదారిలో అధికారం చేపట్టడానికో జనసేన పార్టీ స్థాపించలేదని, భావి తరాల భవిష్యత్తు కోసం పార్టీని ఏర్పాటు చేశానన్నారు. ఇవాళ నేను పరాజయం పాలవ్వొచ్చు.. కానీ సత్యం మాట్లాడి ఓడిపోయినందుకు గర్వంగా ఉందని అన్నారు. భీమవరంలో సోమవారం సాయంత్రం నరసాపురం పార్లమెంట్ పరిధిలోని పాలకొల్లు, తణుకు,ఆచంట నియోజకవర్గ జనసైనికులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్  మాట్లాడుతూ... “చిన్నప్పటి నుంచి హక్కుల కోసం పోరాటం చేయాలన్న తపనే నన్ను రాజకీయాల వైపు నడిపింది. యాక్టర్ కాకపోయి ఉంటే కచ్చితంగా ఎప్పుడో ప్రజా పోరాటంలో ఉండేవాడిని.  నా రాజకీయ ప్రయాణాన్ని డబ్బుతో కొలవను అభిమానంతో కొలుస్తాను.  ఏ రాజకీయ పార్టీకైన జనం రావాలంటే వేలకోట్లు ఖర్చు చేయాలి. జనసేనకు మాత్రం ఆ అవసరం లేదు.  ఎక్కడ సభలు పెట్టినా వేలాది మంది తరలివస్తారు. దీనికి కారణం సమాజం బాగుండాలనే భావనే మనందరిని కలిపింది అని అన్నారు .  

సంబంధిత వర్గం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.