(Local) Wed, 21 Apr, 2021

ధోనీ భద్రతపై ఆందోళన వద్దు - బిపిన్‌రావత్‌

August 05, 2019,   11:18 AM IST
Share on:
ధోనీ భద్రతపై ఆందోళన వద్దు - బిపిన్‌రావత్‌

టీమిండియా దిగ్గజ క్రికెటర్,గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుతం భారత పారామిలటరీ విభాగంలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ధోనీ భద్రత విషయంపై భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌రావత్‌ మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భారత పౌరుడు ఆర్మీ దుస్తులు ధరించడానికి సిద్ధపడితే.. ఆ దుస్తులకు తగిన బాధ్యతలు నిర్వర్తించడానికి కూడా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ధోనీ మాత్రం సాధారణ సైనికుడిలా అక్కడ పనిచేస్తున్నాడు. ధోనీ ఇప్పటికే తన కార్యకలపాలను ప్రారంభించాడని, తనకిచ్చిన బాధ్యతలను దిగ్విజయంగా పూర్తిచేస్తాడనే నమ్మకం ఉందని రావత్‌ చెప్పుకొచ్చారు. కాగా ధోనీ ఆగస్టు 15 వరకు అక్కడే సైనిక విధుల్లో పాల్గొంటాడని తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ఎమ్ఎస్ ధోని పై గవాస్కర్  సంచలన వ్యాఖ్యలు
ఎమ్ఎస్ ధోని పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.