(Local) Fri, 26 Feb, 2021

హాంగ్ కాంగ్ ఉద్యమంపై ఉక్కుపాదం

August 17, 2019,   11:31 AM IST
Share on:
హాంగ్ కాంగ్ ఉద్యమంపై ఉక్కుపాదం

స్థానిక పాలనలో చైనా జోక్యాన్ని నిరసిస్తూ హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్యవాదులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన నేపథ్యంలో లండన్‌లో చైనా రాయబారి లియూ జియామింగ్‌ గురువారం సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆందోళనలు శ్రుతిమించితే చూస్తూ ఊరుకోబోమని హాంకాంగ్‌ ఉద్యమకారులను చైనా హెచ్చరించింది. స్థానిక ప్రభుత్వం వీటిని నియంత్రించలేకపోతే జాతీయ ప్రభుత్వం రంగంలోకి దిగుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు హాంకాంగ్‌ సమస్యపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాలో ఉద్యోగాలు పోతున్నాయని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే చైనా అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనుకుంటే ముందు హాంకాంగ్‌ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని టుమ్ప వ్యాఖ్యానించారు. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే చైనా సైనికులు హాంకాంగ్‌ సరిహద్దుల్లో కవాతు చేశారు.

సంబంధిత వర్గం
ఉద్యమకారులకు మద్దతుగా  ట్రంప్‌
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.